Dum Dumare Song Lyrics Telugu
డుం డుమారే డుం డుమారే
పిల్ల పెళ్లి చాంగ్ భళారే భళారే
ఝామ్మ్ ఝామారే ఝామ్మ్ ఝామారే
శివుడి పెళ్లి చాంగ్ భళారే భళారే
అళగర్ పెరుమాలు అందాల చెల్లెలా
మిల మిలలాడే మీనాక్షి
నీ కంటి పాపని కాచుకో చల్లగా
తెల తెలవారనీ ఈ రాత్రి
చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా
చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా
తందాననా తాళాలతో గంధాలు మాకు పట్టించారా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగావె ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత ఆ
డుం డుమారే డుం డుమారే
పిల్ల పెళ్లి చాంగ్ భళారే భళారే
ఝామ్మ్ ఝామారే ఝామ్మ్ ఝామారే
శివుడి పెళ్లి చాంగ్ భళారే భళారే
మధురాపురికే రాచిలక రాలేనులే
పెళ్లి పందిళ్ళలో ముగ్గేసిన పన్నీటి ముత్యాలెన్నో
కను చేపలకు నిధరంటూ రారాదని
కరగెట్టానులే ఆడానులే గంగమ్మ నాట్యలెన్నో
గుడిలో కోలాటం గుండెలో ఆరాటం
ఎదలో మొదలాయె పోరాటమే
అళగర్ పెరుమాలు అందాల చెల్లెలా
మిల మిలలాడే మీనాక్షి
నీ కంటి పాపని కాచుకో చల్లగా
తెల తెలవారనీ ఈ రాత్రి
అతిసుందరుడే ఈ సోదరుడే తోడు ఉండగా
తల్లి నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
నా ప్రేగు ముడి ప్రేమ గుడి నా తల్లిలే
నువ్వు నా అండగా నాకుండగా కంప్పించిపోదా కైలాసం
ఇపుడే శుభలగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా
అళగర్ పెరుమాలు అందాల చెల్లెలా
మిల మిలలాడే మీనాక్షి
నీ కంటి పాపని కాచుకో చల్లగా
తెల తెలవారనీ ఈ రాత్రి
చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా
చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా
తందాననా తాళాలతో గంధాలు మాకు పట్టించారా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగావె ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత ఆ